మహిళల డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్, చిల్డ్రన్, డిసేబుల్, సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
మెదక్ జిల్లా మహిళా అబివృద్ది శిశు సంక్షేమ శాఖ అద్వర్యంలో (4) ఐ సి డి ఎస్ ప్రాజెక్ట లు కలవు 1) మెదక్ 2) నర్సాపూర్ 3) రామాయంపేట 4) అల్లదుర్గ్
ఈ ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ ల యొక్క లక్ష్యం .
1 ) 0-6 సంవత్సరాలు లోపు బిడ్డల ఆరోగ్య , పౌష్టిక స్థాయిని పెంపొందిoచుట .
- బిడ్డ మానసిక ,శారీరిక,సామజిక అబివృద్దితో పెరగటానికి చక్కని పునాది వేయుట .
- పౌష్టికాహార లోపాని , బడికి వెళ్ళకుండా నిలిచిపోవడాని తగ్గించుట .
- పిల్లల అబివృద్ది కి తోడ్పడుతున్న వివిధ శాఖలను సమానవయ్యపరచుట .
- బిడ్డ అబివృద్ది లో మెరుగు పరచడానికి తల్లికి తగు శిక్షణ నిచ్చి ఆమెనైపుణ్యాని పెంపొందించుట .
ఈ లక్ష్యాలను చేరుకొనుటకై ఈ క్రింది సేవలను అందించుచున్నారు , అవి అనుబంద పోషక ఆహారము ,వ్యాది నిరోధక టీకాలు,ఆరోగ్య పరిక్షలు ,పోషక ఆహార విద్య ,పూర్వ ప్రాదమిక విద్య ,సలహాలు సంప్రదింపులు .
- ఆరోగ్య లక్ష్మీ పధకము ఈ పథకము ద్వారా జిల్లా లోని (1076) అంగన్ వాడి కేంద్రములలో 12652 మంది గర్బిణి,బాలింతలకు, 7నెలల నుండి 1 సంవత్సరం గల 6762 మంది పిల్లలు , 1 సంవత్సరం నుండి 3 సంవత్సరం గల 21787 మంది పిల్లలు మరియు 3 సంవత్సరం నుండి 6 సంవత్సరం గల 26030 మంది పిల్లలకు ఆరోగ్య లక్ష్మీ పధకము ద్వార ఒక పూట సంపూర్ణ ఆహారములో అన్నం, పప్పు, ఆకుకూరలు, ఉడకబెట్టిన కోడిగుడ్డు, పాలు అ౦ది౦చబడుచున్నవి.
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను 08/03/2019 నాడు నిర్వహించాము .
- పోషణ్ అభియాన్ కార్యక్రమం 2018 సెప్టెంబర్ నుండి జిల్లా వ్యాప్తంగా పోషక ఆహార లోప నివారణ,పరిసరాల పరిశుభ్రత మరియు స్వచమైన త్రాగునీరు గురించి అవగాహనా కార్యక్రమాని నిర్వహించటం జరుగుతుంది.
- తల్లి పాల వారోత్సవాలను జిల్లా మొత్తం లో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యoగ ఈ కార్యక్రమాని తండాలలో మరియు ప్రతి మండలలో నిర్వహించడం జరిగింది .
- జిల్లాలోని 1076 ప్రధాన అంగన్వాడి కేంద్రములు కలవు, అందులో 885 ప్రధాన అంగన్వాడి కేంద్రములు మరియు 191 మినీ అంగన్వాడి కేంద్రములు.
- జిల్లాలోని 1076 ప్రధాన అంగన్వాడి కేంద్రములలో గాను,సొంత భవనాలు- 325,అద్దె భవనాలు-362, అద్దె లేని అంగన్ వాడి భవనాలు-389.
వికలాంగుల మరియు వయో వృద్దుల సంక్షేమము:
- వికలాంగులకు సహాయక ఉపకరణముల పంపిణి:
- శారీరక వికలాంగులకు: (09) ట్రై సైకిళ్ళు, (14) చంక కర్రలు, (10) విల్ చెర్లు మరియు (3) మొటోరైజ్ద్ వెహికిల్
- బదిరులకు : (05) శ్రావణ యంత్రములు
- అందులకు: (03) ల్యాప్ టాప్ లు (05) అంధుల చేతి కర్రలు పంపిణి చేయబడినవి.
- అంతర్జాతియ వయోవ్రుద్దుల దినోత్సవము : తేది 01-10-2018 నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయము యందు అంతర్జాతియ వయో వృద్దుల దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. సామజిక సేవలు అందిస్తున్న 80 సంవత్సరములు పైబడిన వయో
- వృద్దులకు సన్మానించడం జరిగింది. “తల్లిదండ్రులు, వయో వృద్దుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007” పై జిల్లా స్థాయి డివిజినల్ స్థాయి అవగాహనా కార్యక్రమములు తేది: 25-02-2019 నుండి 27-02-2019 వరకు నిర్వహించడం జరిగింది.
- అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం : తేది 15-12-2018 నాడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తేది :13-11-2018 నాడు మెదక్ పట్టణములో నిర్వహించిన జిల్లా స్థాయి వికలాంగుల క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రశంస పత్రాలు, మేమొంటోలు అందజేయడం జరిగింది.
- లూయీ బ్రెయిలి జయంతి వేడుకలు: అంధుల అక్షర ప్రదాత లూయీ బ్రెయిలి జయంతి వేడుకలు తేది 10-01-2019 నాడు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయము యందు నిర్వహించడమైనది. ఈ సందర్బముగా ఉత్తమ సేవలు అందిస్తున్న 10 మంది అందులకు సన్మానించడం జరిగింది.
- ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమము మరియు పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాల కల్పన :
- లోక్ సభ ఎన్నికలు 2019 సందర్బముగా ప్రత్యేకంగా వికలాంగుల ఓటర్ల నమోదు కై తేది: 27-02-2019 నుండి 18-03-2019 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.
- లోక్ సభ ఎన్నికలు 2019 సందర్బముగా గుర్తించబడిన పోలింగ్ కేంద్రాలలో (310) విల్ చెర్లు ఏర్పరు చేయడం జరిగింది. అవసరమైన వికలాంగులకు పోలింగ్ కేంద్రమునకు వచ్చి ఓటు వేయుటకు రవాణా సౌకర్యము కల్పించడం జరిగింది. (548) మంది వాలంటీర్లను పోలింగ్ కేంద్రాల వద్ద నియమించడం జరిగింది. అంధుల కొరకై ప్రత్యకంగా నమూనా బ్రెయిలీ బ్యాలట్
పేపర్లను అన్ని పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంచడమైనది. నర్సాపూర్ మరియు మెదక్ యందు వికలాంగులకు ప్రత్యెక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
సమగ్ర బాలల పరిరక్షణ పథకము :
- బాల్య వివాహాలు నిర్మూలన : జనవరి నుండి ఇప్పట్టివరకు (20) బాల్య వివాహాలను ఆపడం జరిగింది. మరియు బాలికను రిస్క్యు చేసి బాలసదనములో చేర్పించడమైనది.
- యువ కార్యక్రమం ; కిషోర బాల బాలికలకు డిసెంబర్ 2018 నుండి వ్యక్తిగత పరిశుభ్రత , మానసిక ఎదుగుదల గురించి మరియు తదితర అంశాలను యువ అనే కార్యక్రమం ద్వార ప్రతి నెల మూడవ బుధవారం పిల్లల డాక్టర్ చే అవగాహనా కల్పించడం జరుగుతుంది .
- తప్పిపోయిన పిల్లల సంరక్షణ కేంద్రం:ఏడుపాయల జాతర సందర్భంగా తప్పిపోయిన పిల్లల సంరక్షణ కేంద్రాని ఏర్పాటు చేసి 52 మంది తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లితండ్రులకు అప్పగించటం జరిగింది.
- బాల్య వివాహ నిర్మూలన చట్టం పై అవగాహన: జిల్లా స్థాయిలో బాల్య వివాహ నిర్మూలన చట్టం ఫై అన్ని మతాల కుల పెద్దలకు అవగాహన కార్యక్రమాని నిర్వహించటం జరిగింది.
- ఆపరేషన్ స్మైల్ – 5 మరియు ఆపరేషన్ ముస్కాన్ -5 :మెదక్ జిల్లా లో ఆపరేషన్ స్మైల్ -5 జనవరి 2019 మరియు ఆపరేషన్ ముస్కాన్ జూలై -2019 లో నిర్వహించడం జరిగింది .ఇందులో బాగంగా జిల్లాలో (194) బాల కార్మికులు, బడి మానేసిన, మరియు బిక్షాటన చేస్తున్న పిల్లలను రెస్క్యూ చేసి పునవరవాసం కల్పించడం జరిగింది.
- బచ్పన్ బచావో ఆందోళన్: మార్చి 2019 నెలలో బచ్పన్ బచావో ఆందోళన్ నిర్వహించి జిల్లలో ఇటుక బట్టిలో మరియు పౌల్ట్రీ ఫార్మ్ లో పని చేస్తున్న (70) బాలకార్మికులను రెస్క్యూ చేసి పునవరవాసం కల్పించడం జరిగింది.
- పిల్లల అక్రమ దత్తత : జనవరి 2019 నుండి మే నెల వరకు (6) పిల్లల అక్రమ దత్తతలను ఆపడం జరిగింది.మరియు పిల్లలను జన్మనించిన తల్లితండ్రులకు అప్పగించడం జరిగింది .
- బాలల హక్కుల రక్షణ కొరకు గ్రామా స్థాయిలో VCPC కమిటీ లను ఏర్పాటు చేయడం జరుగుచున్నవి.