ముగించు

ఎలా చేరుకోవాలి?

గాలి ద్వారా

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (మెదక్‌కు 146 కిలోమీటర్ల దూరంలో) సమీప విమానాశ్రయం, ఇది భారతీయ ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, ముంబై మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలతో అనుసంధానించబడి ఉంది. మెదక్ చేరుకోవడానికి విమానాశ్రయం నుండి టాక్సీ / క్యాబ్‌లు మరియు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

రైలు ద్వారా

మెదక్‌కు రైల్వే స్టేషన్ లేదు. అక్కన్నపేట (19.1 కి.మీ) & కామారెడ్డి (60 కి.మీ) మెదక్ కు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లు , ఇక్కడి నుండి బెంగుళూరు, చెన్నై, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నాందేడ్, వైజాగ్ మరియు హైదరాబాద్ మొదలైన ప్రధాన నగరాలకు రైళ్లు ఉన్నాయి .

రైల్వే స్టేషన్ నుండి మెదక్ చేరుకోవడానికి టాక్సీ / క్యాబ్లు మరియు బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

2019 మార్చి నాటికి అక్కన్నపేట నుంచి మెదక్ మధ్య 17.2 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణానికి రైల్వే శాఖ లక్ష్యాన్ని నిర్దేశించింది.

రోడ్డు ద్వారా

బస్సు ద్వారా:

హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్ మరియు సంగారెడ్డికి పట్టణాలకు మెదక్ నుండి తరుచు బస్సులు ఉన్నాయి . అలాగే మెదక్ బస్సు స్టేషన్ వరకి అన్ని ముఖ్యమైన పట్టణాలు మరియు నగరాల నుండి బస్సులను పొందవచ్చు.

NH7 రహదారి మిమ్మల్ని 2 గంటల్లో గమ్యస్థానానికి తీసుకువెళుతుంది. హైదరాబాద్ మరియు వైజాగ్లలో డీలక్స్ మరియు వోల్వో బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి, మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి నడుస్తున్న బస్సులు కూడా మెదక్ చేరుకోడానికి ఉన్నాయి.

కారు / క్యాబ్ / టాక్సీ ద్వారా:

హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్నందున ముఖ్యంగా శీతాకాలం లో మెదక్ కు సొంత కారు ద్వారా ఉత్తమంగా చేరుకోవచ్చు . పర్యాటకులకు వారు కోరుకున్నన్ని స్టాఫ్ ల వద్ద ఆగడానికి మరియు ఫోటోలను, వీడియోలను తీసుకోడానికి సౌకర్యంగా ఉంటుంది.

మీరు డ్రైవ్ చేయకూడదనుకుంటే మరియు ప్రయాణంలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటే, మెదక్‌కు టాక్సీని బుక్ చేసుకోవడానికి ఎల్లప్పుడూ ఒక ఎంపిక ఉంటుంది. సమీపంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు ఇతర ప్రదేశాలలో వివిధ ట్రావెల్ ఏజెంట్లు అందుబాటులో ఉన్నారు.