ముగించు

ఏడుపాయల దుర్గమ్మ దేవాలయం

                                                     దుర్గా-భవానీ-ఆలయం వెలుపల వీక్షణ ఎడుపయల టెంపుల్ పూర్తి వీక్షణ వర్షాకాలంలో ఎడుపయల ఆలయం

మెదక్ జిల్లా నుండి 8 కిలోమీటర్ల దూరంలో అత్యంత శక్తివంతమైన కనకదుర్గా ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయం ఉంది. పురాణాల ప్రకారం, ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞ గుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ట గౌతమి, భరద్వాజ వంటి సప్త రుషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుండటంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగులతల్లి దేవుళ్లకు వేడుకొనన్నదట. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని తీసుకుని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగవతీ నది ఏడుపాయలుగా చీలి ప్రవహించిందట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతిగుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట. ఏడుగురు రుషులతో యజ్ఞం చేయడం.. గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడు పాయలు అనీ ఈ చరిత్రతో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది. దీని తెలుగులో ఎడు (ఏడు) మరియు పాయలు (ప్రవాహాలు) అని అర్ధం.

 ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయం తెలంగాణ రాష్ట్రంలో దుర్గా భవానీ దేవత యొక్క అత్యంత గౌరవనీయమైన మందిరం. ఎడుపాయలు అనేక సహజ రాతి నిర్మాణాలతో అసాధారణమైన ప్రదేశం. శివరాత్రి మరియు మాఘ అమావాస్య రోజున స్థానికులు జాతర జరుపుకుంటారు.